అశ్వాపురంపాడులో కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్ ప్రారంభం

9చూసినవారు
అశ్వాపురంపాడులో కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అశ్వాపురంపాడు గ్రామంలో శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా ఆధార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్‌ను సర్పంచ్ పోలెబోయిన సుజాత, సంస్థ వ్యవస్థాపకులు తొలెం రమేష్ ప్రారంభించారు. తొలిమెట్టు విద్యతోనే పిల్లలకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని, ఆదివాసీ పిల్లల చదువుకు తమ సంస్థ ఎల్లప్పుడూ సహకరిస్తుందని రమేష్ తెలిపారు. తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపుతామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్