గోదావరి ముంపు నివారణకు కరకట్టల నిర్మాణం: ప్రభుత్వం ఆమోదం

1చూసినవారు
గోదావరి ముంపు నివారణకు కరకట్టల నిర్మాణం: ప్రభుత్వం ఆమోదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలో గోదావరి ముంపు నివారణకు ప్రభుత్వం కరకట్టల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. సంజీవరెడ్డిపాలెం నుంచి నాగినేనిప్రోలు రెడ్డిపాలెం వరకు 11 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించనున్నారు. దీనికోసం 257 ఎకరాల భూసేకరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలోనే సర్వే ప్రారంభం కానుంది. ఈ నిర్మాణంతో బూర్గంపాడు మండలంలోని పలు గ్రామాలకు గోదావరి, కిన్నెరసాని ముంపు ముప్పు తగ్గుతుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్