భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం అశ్వాపురం సీతారాం కెనాల్ బ్రిడ్జి వద్ద బుధవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న సుమారు రూ.20 లక్షల విలువైన 40.560 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన అరబిందో బిశ్వాస్ (33), అతని భార్య సుప్రియ బిశ్వాస్ (26)ను పోలీసులు అరెస్టు చేశారు. కలిమెల నుంచి షిర్డీకి గంజాయి తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.