మణుగూరు మండలంలోని కొలువై ఉన్న శ్రీ నీలకంటేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే గోదావరి స్నానాలు ఆచరించి, శివాలయం వద్ద కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించారు. భక్తులు దీపాలు వెలిగించి, మహిళలు తమ కుటుంబాల క్షేమం కోసం పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.