భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పినపాక, కరకగూడెం మండలాలకు చెందిన బాధితులకు సీఎంఆర్ఎఫ్ కింద రూ. 5,37,000, అలాగే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద 28 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 28,03,248 విలువైన చెక్కులను మంగళవారం అందజేశారు. పేద కుటుంబాలకు ఆర్థిక ధైర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు త్వరగా అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.