ఆదివాసీ గ్రామంలో గిరిజన కుటుంబాలకు దోమతెరల పంపిణీ

1074చూసినవారు
ఆదివాసీ గ్రామంలో గిరిజన కుటుంబాలకు దోమతెరల పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం అశ్వాపురంపాడు ఆదివాసీ గ్రామంలో మంగళవారం 'అఖండ యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్' ఆధ్వర్యంలో గిరిజన కుటుంబాలకు దోమతెరలు పంపిణీ చేశారు. దోమల బెడద నుంచి రక్షణ, ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ట్రస్ట్ చైర్మన్ కట్ల నరేష్ తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజల సంక్షేమానికి ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తుందని, భవిష్యత్తులో విద్య, వైద్యం, ఆహార భద్రతపై మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. గ్రామస్థులు ఈ పంపిణీపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్