భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం ఐటీసీ అనుబంధ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక వైద్యులను ఘనంగా సన్మానించారు. యూనిట్ హెడ్ శ్రీశైలేంద్రకుమార్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్లు హేమంత్, రాజశేఖర్ రెడ్డి, హరికృష్ణ, విజయకుమార్, అమృతసింధులను గౌరవించారు. పేదలకు రోటరీ క్లబ్ చేసే సేవలకు సహకరిస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఆర్. పి. సింగ్, డేవిడ్ ఆలివర్ పాల్గొన్నారు. వైద్యుల సేవలు అనన్యమైనవని ఈ సందర్భంగా కొనియాడారు.