మణుగూరులో కుక్కల స్వైర విహారం

55చూసినవారు
మణుగూరులో కుక్కల స్వైర విహారం
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇటీవల శేషగిరి నగర్లో ఓ బాలుడిపై కుక్కల దాడి ఘటన మరువక ముందే కాంగ్రెస్ మైనార్టీ నాయకులు రహీం పాషాపై బుధవారం కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన కాలికి తీవ్ర గాయమైంది. కుక్కలతో భయం గుప్పిట్లో జీవిస్తున్నామని, మున్సిపాలిటీ అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్