
కారు, ఆటో, లారీ ఢీ.. ఐదుగురు మృతి
AP: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిలమత్తూరు మండలం బాగేపల్లి సుంకలమ్మ ఆలయం వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. కారు, ఆటో, లారీ ఢీకొన్న ఈ ఘటనలో ఆటోలోని నలుగురు మహిళలు, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా బాగేపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




