మంగళవారం నాడు పినపాక మండలంలో జిల్లా పంచాయతీ అధికారి సుధీర్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. ఆయన బయ్యారం, భూపాలపట్నం, సీతంపేట గ్రామపంచాయతీలను పరిశీలించి, గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, గ్రామాభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీడీవో వెంకటేశ్వరరావుతో సమీక్షించారు. పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో మాట్లాడి ప్రభుత్వ పథకాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.