మంగళవారం గుండాల పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ వెంకన్న సందర్శించారు. ఆయన పోలీస్ స్టేషన్ లోని ఆయుధాల రిజిస్టర్లు, కేసు ప్రాపర్టీ రిజిస్టర్లు, జీడి, ఎఫ్ఐఆర్ ఇండెక్స్ లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల ఫైళ్లను పరిశీలించి, వాటిని త్వరగా పరిష్కరించడానికి కీలక సూచనలు చేశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, పరిష్కారానికి పలు సూచనలు అందించారు.