గురువారం పినపాక క్రాస్ రోడ్ వద్ద ఉప్పాక బ్రిడ్జి సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. విద్యుత్ తీగల్లో నిప్పురవ్వలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఒక దుకాణం పూర్తిగా దగ్ధమవ్వగా, 10 పవర్ స్పెయర్లు కాలిపోయాయి. అగ్నిమాపక అధికారులు వెంటనే స్పందించి, విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మంటలను అదుపులోకి తెచ్చారు.