పోడు సాగు యత్నంపై అటవీ అధికారుల కొరడా

5చూసినవారు
పోడు సాగు యత్నంపై అటవీ అధికారుల కొరడా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, అశ్వాపురం ఫారెస్ట్ రేంజ్‌ పరిధిలోని కృష్ణసాగర్ ఆర్‌ఎఫ్‌ కంపార్ట్‌మెంట్‌ 225లో అటవీ భూమిని పోడు సాగులోకి మార్చేందుకు చేపట్టిన ప్రయత్నాన్ని అటవీ అధికారులు అడ్డుకున్నారు. డోజర్‌ ట్రాక్టర్‌తో భూమిని దున్నుతున్న చక్క ఈశ్వరయ్య, ట్రాక్టర్‌ యజమాని ఇనపెంగి నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. సుమారు 0.10 హెక్టార్లలో ప్లవింగ్‌ చేసినట్లు గుర్తించి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అటవీ భూముల్లో పోడు సాగు యత్నాలకు అడ్డుకట్ట వేసింది.

సంబంధిత పోస్ట్