యువతకు ఉచిత వొకేషనల్ శిక్షణ ప్రారంభం

1339చూసినవారు
యువతకు ఉచిత వొకేషనల్ శిక్షణ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలోని ఆళ్లపల్లి మండలంలో పాల్వంచ నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో మహిళా సాధికార కేంద్రంలో ఉచిత వొకేషనల్ శిక్షణ బుధవారం ప్రారంభమైంది. పురుషులకు వెల్డర్, ఎలక్ట్రికల్, ఫిట్టర్ (6 నెలలు), రిఫ్రిజిరేషన్ & ఏసీ, సోలార్ (4 నెలలు) కోర్సులు; మహిళలకు కంప్యూటర్, ట్యాలీ, బ్యూటిషియన్, టైలరింగ్ (3 నెలలు) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 8వ తరగతి నుంచి ఐటీఐ/డిగ్రీ అర్హత, 18–35 వయస్సు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టైపెండ్ రూ.1000–1250. ఆసక్తిగలవారు పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తులు సమర్పించాలని ఎస్సై ఎం. సోమేశ్వర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్