భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మిట్టగూడెం తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ బాలుర కళాశాలలో శుక్రవారం ఎన్సీసీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బండారుపల్లి రవి, వైస్ ప్రిన్సిపాల్, పీఐ స్వామి, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. గాంధీజీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.