సీతారాంపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

5చూసినవారు
సీతారాంపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో నాగబండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్ పోలేబోయిన సుజాత, గ్రామ పెద్దలు రామలింగం, నర్సయ్య హాజరై గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటికీ ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్