గుండాల మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం కల్తీ సమ్మయ్య అనే రైతుకు చెందిన దుక్కిటెద్దు పిడుగుపాటుకు గురై మృతి చెందింది. వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే ఎద్దు చనిపోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సమ్మయ్య కోరుతున్నారు.