
పెళ్లికి పట్టుబట్టిందని.. టీచర్‌ని చంపిని స్కూల్ మేనేజర్
ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో అక్టోబర్ 31న జరిగిన ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసిందనే కోపంతో స్కూల్ మేనేజర్ విజయ్ నిషాద్.. మహిళా టీచర్ రాణి విశ్వకర్మను తన కారులో గొంతునులిమి హత్య చేశాడు. నిందితుడు మృతదేహం ఎవరికీ దొరకకుండా కారు డిక్కీలోనే రోజంతా తిప్పాడు. చివరకు రాత్రి సమయంలో నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పడేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.




