పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాలలో అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (AEDP) కింద ఉద్యోగావకాశాల ప్రత్యేక కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పోలారపు పద్మ తెలిపారు. బీకాం బీఎఫ్‌ఎస్‌ఐ, బీఎస్సీ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఐదో సెమిస్టర్‌లో అప్రెంటిస్‌షిప్ సమయంలో స్టైఫెండ్‌తో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.