
కాశీబుగ్గ ఆలయ నిర్మాణానికి అనుమతులు తీసుకోలేదు: ఎస్పీ (వీడియో)
AP: కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారని, ఆలయ నిర్వాహకులు అనుమతులు తీసుకోలేదని, పోలీసులకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. రెయిలింగ్ కూలిపోవడంతో భక్తులు సుమారు ఏడు అడుగుల ఎత్తు నుంచి పడిపోయారని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.




