కరకగూడెం: 600 ఎకరాల భూమి అటవీ భూమే

2చూసినవారు
కరకగూడెం: 600 ఎకరాల భూమి అటవీ భూమే
బుధవారం, కరకగూడెం మండలం కాల్వలనాగరంలోని 600 ఎకరాల వివాదాస్పద భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి ముగింపు పలుకుతూ, ఆ భూమి పట్టా భూమి కాదని, రక్షిత అటవీ భూమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి ధర్మాసనం ఈ మేరకు తుది ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు పినపాక మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్