కరకగూడెం మండలంలోని మోతే, సుమంత్ బట్టుపల్లి, గొల్లగూడెంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశాయి. మండల యూత్ ప్రెసిడెంట్ గుండ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ ను వేధించడం తగదని, రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.