కరకగూడెం మండలంలో ఆదివారం, కొత్త బట్టలు కొనివ్వలేదన్న మనస్తాపంతో చర్ల చరణ్ తేజ (19) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 18న జరిగిన వనభోజనాలకు కొత్త బట్టలు అడగగా, తల్లిదండ్రులు తర్వాత కొనిస్తామని చెప్పడంతో ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.