కరకగూడెం: కాంగ్రెస్ ను ప్రజలు విశ్వసించడం లేదు: రేగా

62చూసినవారు
కరకగూడెం: కాంగ్రెస్ ను ప్రజలు విశ్వసించడం లేదు: రేగా
పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. శనివారం కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ 7 గ్రామపంచాయతీల ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేగా మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని, దానికి తాజా దిల్లీ ఫలితాలే నిదర్శనమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు.

సంబంధిత పోస్ట్