అనారోగ్యంతో కొత్తగూడెం వాసి మలకుర్తి బాలక్రిష్ణ కన్నుమూత

1చూసినవారు
అనారోగ్యంతో కొత్తగూడెం వాసి మలకుర్తి బాలక్రిష్ణ కన్నుమూత
కరకగూడెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన మలకుర్తి బాలక్రిష్ణ (ఆటో డ్రైవర్ బాలు) అనారోగ్యంతో హనుమకొండ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున సమయంలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హనుమకొండ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. బాలక్రిష్ణ మరణ వార్త తెలియడంతో కొత్తగూడెం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్