మణుగూరు: భారీ క్రేన్ ను ప్రారంభించిన ఏరియా జీఎం

71చూసినవారు
మణుగూరు: భారీ క్రేన్ ను ప్రారంభించిన ఏరియా జీఎం
మణుగూరు సింగరేణి ఏరియాలో రూ. 1. 74 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన భారీ క్రేన్ ను  ఏరియా జీఎం దుర్గం రామచందర్ తన సిబ్బందితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ మణుగూరు ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి ఈ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్