మణుగూరు సింగరేణి ఏరియా ఓసి టు ప్రాంతంలో కార్మికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు బుధవారం డిఎస్పి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. తెలియని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్లు, లింకులు, ఓటిపిల పట్ల జాగ్రత్తగా ఉండాలని డిఎస్పి సూచించారు. ఈ కార్యక్రమంలో జిఎం రామ్ చందర్, డీజీఎం రమేష్, సిఐ నాగబాబు పాల్గొన్నారు.