అనుమతులున్నాయని చెప్పి మణుగూరు గుట్టమల్లారం వద్ద రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోని చెట్లను నరికి ఫోర్ లైన్ రోడ్లు వేసినా అటవీ అధికారులు పట్టించుకోలేదని, వృథాగా ఉన్న వాటిని పేదలకు పంచాలని రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ గురువారం డిమాండ్ చేశారు. ఇసుక ర్యాంప్, ఫోర్ లైన్ రోడ్ల పేరుతో దశాబ్దాల వృక్షాలను తొలగించి వన్యప్రాణుల ఆవాసాలను నాశనం చేశారని ఆమె ఆరోపించారు.