మణుగూరు-హైదరాబాద్ బస్సులు యథాతథం, కొత్తగూడెంకు అదనపు సర్వీసులు: సీపీఐ

0చూసినవారు
మణుగూరు-హైదరాబాద్ బస్సులు యథాతథం, కొత్తగూడెంకు అదనపు సర్వీసులు: సీపీఐ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలో బుధవారం సీపీఐ నాయకులు దుర్గ్యాల సుధాకర్, జక్కుల రాజబాబు ఆర్టీసీ డీఎం శ్యాంసుందర్‌కు వినతిపత్రం అందించారు. మణుగూరు నుంచి హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ బస్సులను యథాతథంగా నడపాలని, కొత్తగూడెంకు అదనపు సర్వీసులు పెంచాలని వారు కోరారు. రాత్రి 9 తర్వాత ఖమ్మం నుంచి మణుగూరుకు బస్సు, గుండాల నుంచి సాయంత్రం ట్రిప్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులు, విద్యార్థులు, మహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సర్వీసులు పెంచాలని సీపీఐ నేతలు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్