మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నతురాలు ఇందిరా గాంధీ అని, ఆమె పేరుతో ఇప్పటికీ రాష్ట్రంలో ఇళ్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే కొనియాడారు.