మణుగూరు సింగరేణి ఏరియా పీవీకాలనీలో నివాసయోగ్యం కాని క్వార్టర్ల స్థితిగతులను ఏరియా సింగరేణి అధికారులు, హౌస్ అలాట్ మెంట్ సభ్యులు మంగళవారం పరిశీలించారు. నివాసానికి పనికిరాని 10 ఖాళీ క్వార్టర్లను జేసిబి సహాయంతో వెంటనే కూల్చివేశారు. అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి, రెండు రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.