మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఒక ఇంట్లో నిల్వ ఉంచిన 3.5 క్వింటాళ్ల గంజాయిని మణుగూరు పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చల్ల శ్రీనివాస్ ఇంట్లో గంజాయి ఉందని వచ్చిన సమాచారంతో పోలీసులు దాడి చేసి, గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటనపై ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతా ఇద్దరిని ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాఘవేంద్రెడ్డి తెలిపారు.