మణుగూరు పట్టణంలోని అరుంధతి నగర్లో గురువారం నూతనంగా నిర్మించిన 60 వేల లీటర్ల సామర్థ్యం గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఈ ట్యాంక్ నిర్మాణం పూర్తయ్యింది. దీని ద్వారా 100 కుటుంబాలకు పైగా స్వచ్ఛమైన మంచినీరు అందుతుందని తెలిపారు.