మణుగూరు: 5 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే

1చూసినవారు
మణుగూరు: 5 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే
పినపాక మండలానికి చెందిన తోలెం కమలాకర్ అత్యవసర వైద్య చికిత్స కోసం మంజూరైన రూ. 5 లక్షల ఎల్‌ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం మణుగూరు క్యాంపు కార్యాలయంలో కమలాకర్ తరఫున మంకిడి సురేష్‌కు అందజేశారు. ప్రజల ఆరోగ్య సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, కమలాకర్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రభుత్వ సహాయంపై కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.