మణుగూరు, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు శుక్రవారం తెలిపారు. మెంటేనెన్స్ పనుల్లో భాగంగా 33/11 కేవీ ఉప కేంద్రంలో కొత్త 5ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.