మణుగూరు పట్టణంలో అనుమతి లేకుండా గోదావరి నుంచి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. ఈ ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగబాబు హెచ్చరించారు.