కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని సీఐటీయూ జిల్లా నాయకులు సత్తనపల్లి సాంబశివరావు అన్నారు. కార్మిక హక్కులను హరిస్తుందని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు మే 20న సార్వత్రిక సమ్మె చేయనున్నట్టు తెలిపారు. కార్మికులు హక్కుల్లో భాగంగా గురువారం మణుగూరు ఎంపీఓకు సమ్మె నోటీస్ అందజేశారు.