మణుగూరు మండలంలో శుక్రవారం వేధింపులు తాళలేక శోభారాణి(42) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందగా, ములుగు జిల్లా మంగపేట మండలం, కోమటిపల్లికి చెందిన మధుకర్ మణుగూరులో ఉంటూ ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన శోభారాణి రెండు రోజుల క్రితం పురుగుమందు తాగారు. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.