అశ్వాపురం మండలంలో రేపు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఓరుగంటి రమేశ్ బాబు శుక్రవారం తెలిపారు. ఈ పర్యటన తొలుత మిట్టగూడెంలో ప్రారంభమై మండల కేంద్రంతో పాటు అమెర్ధ గ్రామ పంచాయతీలో జరుగుతుందన్నారు. ఇటీవల కాలంలో గ్రామాలలో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభిస్తారని తెలిపారు.