సాహిత్య రంగంలో సేవలకు గుర్తింపుగా సారపాకకు చెందిన కవయిత్రి, రచయిత్రి నాగవేణి చాగర్లమూడికి ‘ఇండియన్ ఐకాన్ జాతీయ పురస్కారం’ లభించింది. తెలుగు వెలుగు సాహితీ వేదిక తదితర సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆమెను అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం అవార్డు వివరాలు వెల్లడించారు. సాహిత్య, సాంస్కృతిక సేవలను ప్రోత్సహించడమే పురస్కారం ఉద్దేశమని పేర్కొన్నారు.