జిల్లా కలెక్టరేట్‌లో వేపకాయల బతుకమ్మ వేడుకలు

2734చూసినవారు
కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మను జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మున్సిపాలిటీలు, టీజీవోస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై, మహిళా అధికారులు, ఉద్యోగులతో కలిసి బతుకమ్మలకు పూజ చేశారు.