
పెట్రోల్, డీజిల్ ధరలు: రూ.33 వరకు పెంపునకు ఆయిల్ కంపెనీల డిమాండ్
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు భారంగా మారాయి. ఇప్పటికే లీటరుపై రూ.8 పెరిగినప్పటికీ, నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఆయిల్ కంపెనీలు లీటరుకు మరో రూ.28 నుంచి రూ.33 వరకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ప్రకారం, లీటరుపై రూ.20 వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే, ఆర్థిక వ్యవస్థపై, ద్రవ్యోల్బణంపై ప్రభావం పడుతుందని కేంద్రం భావిస్తున్నందున, ధరల పెంపు విడతల వారీగా ఉండొచ్చని అంచనా.




