మణుగూరు మండలంలోని సుందరయ్యనగర్ రామకృష్ణ స్కూల్ ప్రాంతంలో స్థానికులు ఆదివారం పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ‘ఇరుముడి’ సినిమాను వీక్షించారు. ఏరియా వాసులంతా కలిసి సినిమా చూస్తూ ఆనాటి రోజులను, మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాత సినిమా ద్వారా గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.