పినపాక మండల సిపిఎం పార్టీ సభ్యులు, శాఖ కార్యదర్శుల సమావేశంలో, జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న రాబోయే మేడే కార్యక్రమాలను అన్ని గ్రామ శాఖల పరిధిలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం సోమవారం పూనేం రాజేశ్వరి అధ్యక్షతన జరిగింది. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని నాయకులు విమర్శించారు.