పినపాక: స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి

80చూసినవారు
పినపాక: స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో కమిటీని ఎన్నుకోవడం జరిగిందని పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోడిశాల రామనాథం ఆదివారం అన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా కే సాయికుమార్, కోశాధికారిగా షేక్ రషీద్ ఎన్నుకున్నామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో యువత చురుగ్గా పాల్గొనాలని, కాంగ్రెస్ జెండా ఎగరేసి సత్తా చాటాలన్నారు.

సంబంధిత పోస్ట్