పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. గురువారం ఈ తెగిపోయిన విద్యుత్ తీగలు రోడ్డుపక్కన ఉన్న ఆవుపై పడటంతో ఆవు, దాని లేగదూడ అక్కడికక్కడే మృతి చెందాయి. మృతిచెందిన పశువులు రైతు మర్ల సమ్మయ్యకు చెందినవిగా గుర్తించారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.