పినపాక: పశువుల ఆరోగ్యానికి నులిపురుగుల మందుల పంపిణీ

1చూసినవారు
పినపాక: పశువుల ఆరోగ్యానికి నులిపురుగుల మందుల పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం గ్రామంలో పశువులకు నులిపురుగుల నివారణ మందులను బుధవారం పంపిణీ చేశారు. పశువైద్యాధికారిణి డాక్టర్ ఉజ్వల మాట్లాడుతూ, పశువులకు నులిపురుగుల మందుల పంపిణీ వాటి ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఉత్పాదకతను పెంచడానికి చాలా ముఖ్యమని తెలిపారు. పశువుల్లో అంతర్గత పరాన్నజీవుల వల్ల బరువు తగ్గడం, పాలు తగ్గడం, వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్