సోమవారం, పినపాక మండలం బోటుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పాల చెరువుల వద్ద జాతీయ ఉపాధి హామీ పనులను స్థానిక సర్పంచ్ నూప బాపనమ్మ ప్రారంభించారు. పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, కార్మికులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆమె సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆమె సూచించారు.