పినపాక మండలం ఈ. బయ్యారం అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం పర్యావరణ పరిరక్షణపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఓ స్నేహలత తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, కాలుష్య నివారణ వంటి అంశాలపై విద్యార్థులతో వ్యాసరచన పోటీలు నిర్వహించామని ఆమె పేర్కొన్నారు.
విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.