పినపాక: గడ్డి వాము దగ్ధం

3చూసినవారు
పినపాక మండలంలోని అమరారం గ్రామంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన మహ్మద్ ముజఫర్‌కు చెందిన సుమారు పది ఎకరాల వ్యవసాయ భూమిలో నిల్వ ఉంచిన వరి గడ్డి వాముకు ఆకస్మికంగా నిప్పు అంటుకుంది. మంటలను గమనించిన స్థానిక రైతులు, గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్